- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్ఎం టీవీ "నారి" పురస్కార్ అవార్డుకు జూలూరు ధనలక్ష్మి ఎంపిక ..
దిశ, దేవరకొండ : మహిళలు వంటింటికే పరిమితం కాదు వారు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నినాదంతో శుక్రవారం హైదరాబాదులో హెచ్ఎం టీవీ నిర్వహించిన "నారి" పురస్కార అవార్డుకు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికల్ గ్రామ సర్పంచి, సర్పంచుల ఫోరం మహిళ అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్కే రోజా, చేతుల మీదగా అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల చేతిలో అధికారం ఉంటే ఏ పని సాధించడానికి వెనుకాడరని ఆమె అన్నారు.
తాటికోల్ గ్రామ సర్పంచిగా పనిచేస్తున్న నేను గ్రామంలో మధ్య నిషేధాన్ని పగడ్బందీగా అమలు పరచడం కోసం, గ్రామం మహిళలతో కలిసి బెల్ట్ షాపులపై దాడి చేసి మధ్యాన్ని ఊర్లోకి రాకుండా చేసినందుకు గాను, తాటికోల్ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా అడ్డుకున్నందుకుగాను, రాహుల్ గాంధీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్ర లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్లు నడిచినందుకుగాను నా ప్రతిభను గుర్తించి హెచ్ఎం టీవీ "నారి" అవార్డును ఎంపిక చేయడం పట్ల తను సంతోషం వ్యక్తపరిచారు. ఈ అవార్డు రావడంపట్ల తనకు ప్రజాసేవ చేయాలనే మరింత బాధ్యత పెరిగిందని, మహిళల పట్ల ఎవరైనా చిన్నచూపు చూసినట్లు అయితే సహించేది లేదని ఆమె అన్నారు. అలాగే ఈ అవార్డుకు ఎంపిక చేసిన హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, తాటికోల్ గ్రామ ప్రజానీకానికి రుణపడి ఉంటానని ఆమె తెలిపారు.