కేటీఆర్,హరీష్ రావు అలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది - మంత్రి

by Naveena |
కేటీఆర్,హరీష్ రావు అలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది - మంత్రి
X

దిశ,చింతపల్లి: మునుగోడు దేవరకొండ నియోజకవర్గంను సస్యశ్యామలం చేయడానికి రెండు సంవత్సరాలలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేస్తామ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం మాల్ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కేసిఆర్ సొంత నియోజకవర్గం అభివృద్ధి చేశాడే తప్ప రాష్ట్రంలోని ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టితే తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెలకు 65 వేల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కడుతున్నామని తెలిపారు. కేటీఆర్,హరీష్ రావులకు పిచ్చి పట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీశైలం టన్నల్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తే..కేసిఆర్ వచ్చిన తర్వాత తనకు ఏడ పేరు వస్తుందోనని ప్రాజెక్టును నిధులు కేటాయించకుండా నిలిపివేశాడని ఆరోపించారు. మూడు సంవత్సరాల కాలంలో డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. మూసి ప్రాజెక్టుకు డిపిఆర్ కేటాయించక ముందే లక్షన్నర కోట్లు అవినీతి జరిగిందని కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు . దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకుందామని తెలిపారు. మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలలో ఎక్కువ మంది రైతులు పత్తి పండిస్తారని పత్తి సెంటర్లను ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేసే విధంగా మంత్రి కృషి చేయాలని కోరారు. మాల్ మార్కెట్,దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రెండు సైతం ఓసీలకు వచ్చాయని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళలకు రిజర్వేషన్ వచ్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కష్టకాలంలో కూడా పార్టీలు మారని వారిని గుర్తించి వారికి అవకాశాలు కల్పించడం జరిగిందని దేవరకొండ ఎమ్మెల్యే అన్నారు. యువకుడైన దొంత అలివేలు సంజీవ రెడ్డిని గతంలో బిఅర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ప్రజా సమస్యలు తీరుస్తూ..కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశాడని, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తగిన రీతిలో గౌరవం లభిస్తుందన్నారు. మార్కెట్ పరిధిలోని పలు మండలాల పార్టీ నాయకులకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. నూతన మార్కెట్ పాలకవర్గ సభ్యులు రైతుల కోసం కృషి చేయాలని సూచించారు.

Advertisement

Next Story