- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడేళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్ల దాష్టీకం.. ఏకంగా పబ్లిక్ వేడుకలో!
దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిని ఇద్దరు మైనర్లు లైంగికంగా వేధింపులకు గురిచేశారు. అక్టోబర్ 4వ తేదీన ఈ ఘటన ఇండోర్‌లో చోటుచోసుకోగా.. బాధితుడి తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆలస్యంగా వెలుగుచూసింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇండోర్‌లో ఏర్పాటు చేసిన గార్బా పండాల్ వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఇదే టైంలో 13 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్లు బాలుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వారి చేష్టలు దగ్గరిలోని సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి.
విషయం తెలుసుకున్న బాలుడి తల్లి కనడియా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం ఆ ఇద్దరు మైనర్లు మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో ఓ ఎన్జీవో డైరెక్టర్ వసీమ్ ఇక్బాల్ బాలుడికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని వారి కుటుంబానికి ధైర్యం చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పిల్లవాడు భయపడ్డాడు, బాధపడ్డాడు. కౌన్సెలింగ్ కోసం పోక్సో చట్టంలోని రూల్స్ మేరకు అతనికి సహాయక వ్యక్తిని ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము’ అని వసీమ్ తెలిపాడు.