‘మహిళలు గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించాలి’

by Aamani |
‘మహిళలు గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించాలి’
X

దిశ, హుస్నాబాద్ : మహిళలు గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించినప్పుడే సార్ధకత ఏర్పడుతుందని మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ స్త్రీలు గౌరవంగా జీవించే హక్కును చాటి చెబుతూ వెలివాడలు కాదు.. తొలి వాడాలంటూ చాటేదే బహుజన బతుకమ్మ అని తెలియజేస్తూ అసమానతలను ప్రతిఘటించడం ఆత్మగౌరవంతో జీవించడం మహిళల హక్కు అంటూ చాటుదాం అనే ఉద్దేశంతో హుస్నాబాద్ పట్టణంలో సోమవారం బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు అరుణోదయ విమలక్క విచ్చేశారు. ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడి పాడారు. అరుణోదయ విమలక్క తన పాటలతో మంత్రముగ్ధులను చేశారు. అనంతరం శాలువాతో మహిళలు విమలక్కను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... హుస్నాబాద్ కేంద్రంగా బహుజన బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి విమలక్క రావడం బతుకమ్మ వేడుకలు వారు పాల్గొనడం ఆనందదాయకమన్నారు. మహిళలందరూ నిండు మనసుతో ఆడాలని అప్పుడే ఆ మాత ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ ను పెద్ద పూల లాగా జరుపుకుంటారని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ శుభం జరగాలని అమ్మ వారిని వేడుకున్నారు. మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story