హరియాణా, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం

by M.Rajitha |
హరియాణా, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం
X

దిశ, వెబ్ డెస్క్ : హరియాణా(Hariyana), జమ్మూ కాశ్మీర్(Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుండే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయగా.. ఎలాంటి గొడవలకు తావులేకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. కాగా హరియాణా, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నప్పటికీ, గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగగా.. 67.90% పోలింగ్ నమోదయింది. అన్ని స్థానాలకు కలిపి మొత్తం 1031 మంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ.. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉందని తెలుస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ మూడు విడతల్లో కలిపి 63.45% పోలింగ్ నమోదవగా.. అన్ని స్థానాలకు కలిపి 873 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరికొద్ది నెలల్లోనే ఢిల్లీ, మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు ఉండగా.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా వాటిపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందో తెలియాలంటే రేపటి దాకా ఎదురు చూడాల్సిందే.

Advertisement

Next Story