ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచండి..

by Kalyani |
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచండి..
X

దిశ, సూర్యా పేట: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచే దిశగా సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ కోరారు. సోమవారం జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో ఆయిల్ పామ్ కంపెనీ, డ్రిప్ కంపెనీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్ణీత ఆయిల్ పామ్ విస్తీర్ణంను రైతులు సాగు చేసేలా పనిచేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని మార్చి వరకు పూర్తిచేయాలని కోరారు. ఈ సమావేశంలో పతాంజలి పుడ్స్ లిమిటెడ్ ఆయిల్ పామ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి యాదగిరి, ప్రాంతీయ ఉద్యాన అధికారులు కన్న జగన్, వి స్రవంతి, అనిత, ఎమ్ఐ ఇంజనీర్ నరేష్, ఆయిల్ పామ్ కంపెనీ మేనేజర్ జె హరీష్ , అధికారులు వి శశికుమార్, సుధాకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story