పరిపాలనకు చేతగాని వ్యక్తులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు: ఎమ్మెల్యే

by Naveena |
పరిపాలనకు చేతగాని వ్యక్తులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు: ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు; పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని గాలికి వదిలి..పరిపాలన చేసిన బీఆర్ఎస్ వ్యక్తులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో 100కోట్ల రూపాయల నిధులు వ్యయంలో మంజూరైన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తనకు పదవుల కన్నా ఈ ప్రాంత అభివృద్దే ముఖ్యమన్నారు. ఈ ప్రాంత అబివృద్ది నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసైనా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. గతంలో కులమత బేధాలు లేకుండా అందరూ ఒకే చోట చదువుకున్నామన్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో విద్యను అభ్యసించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. కుల,మత బేధాలు, తారతమ్యాలు, హెచ్చుతగ్గులు, గొప్ప, పేద లాంటివి ఏవి ఉండకుండా చేయాలనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల తీసుకొచ్చిందన్నారు. ఇది స్కూల్ కాదు దేవాలయమన్నారు. నియోజకవర్గంలో మండలానికి ఆరు పాఠశాలల చొప్పున 50 పాఠశాలలు కట్టించే బాధ్యత తనదని హామి ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శమన్నారు. గత పాలకుల పాలనలో నియోజకవర్గంలో విద్య, వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. మీ గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, విద్య, వైద్యం వికసించాలన్నా .. ప్రజలందరూ బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. గత ప్రభుత్వ హాయంలో తన రాజీనామాతో.. ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాల దగ్గరికి తీసుకొస్తే 600 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. త్వరలోనే ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల, శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని, మనకు అండగా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారన్నారు. జిల్లా ప్రాజెక్టుల విషయంలో అభివృద్ధిలో రాజీ పడడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ కలెక్టర్ పూర్ణ చంద్రరావు, డిసిసిబి నల్గొండ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీవో శ్రీనివాస్ రావు, డీపీఓ మురళీ, ఆర్ అండ్ బి సత్యనారాయణ రెడ్డి, చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ నరేందర్, ఎంపిడిఓ పూజ, ఎంఈఓ రవీందర్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, మాజీ ప్రజాప్రతినిధులు నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్, జాజుల అంజయ్య, పొలగొని సత్యం,వెన్ రెడ్డి రాజు, తాడూరి వెంకట్ రెడ్డి, గుత్తా ఉమాప్రేమ్ చందర్ రెడ్డి, కర్నాటి స్వామి, వేదిరే మోఘారెడ్డి, చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, దోటి సుజాత వెంకటేశ్వర్లు, పాశం సురేందర్ రెడ్డి, బుజ్జి, ఏవిరెడ్డి, పబ్బు రాజు, నర్సిరెడ్డి, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, వట్టికోటి శేఖర్, అనంత వీణస్వామి గౌడ్, పగిళ్ళ బిక్షం, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story