- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం.. మిర్యాలగూడ సూర్యాపేట రాకపోకలు బంద్
దిశ,వేములపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన మండలంలోని పలు గ్రామాల్లో, చెరువులు అలుగు పోస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదివారం కురిసిన వర్షాలకు మండలంలోని ఆమనగల్ చెరువు అలుగు పోయడం వలన లక్ష్మీదేవి గూడెం సమీపంలోని భీమారం సూర్యాపేట రోడ్డు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో మిర్యాలగూడ నుండి మొల్కపట్నం, రావులపెంట గ్రామాల మీదుగా సూర్యాపేటకు వెళ్లే రహదారి బంద్ అయింది. దీంతో మండలంలోని ఆమనగల్లు, లక్ష్మీదేవి గూడెం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భీమవరం విధంగా సూర్యాపేటకు వెళ్లే బస్సులను నేరేడుచర్ల మీదుగా మళ్లించారు. దీంతోపాటు మండలంలోని శెట్టిపాలెం సమీపంలోని చిత్రపరక వాగు ఉధృతంగా ప్రవహించడంతో సమీపంలోని సుమారు 20 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో చెరువు అలుగు పోస్తుండడంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. బుగ్గ బావి గూడెం గ్రామంలో వరద నీటితో సుమారు 50 ఎకరాలు పంట పొలాలు నీట మునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలిన ఇల్లు..
మండలంలో రావులపెంట గ్రామంలో ఆదివారం కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన ఓరుగంటి లక్ష్మయ్య కి చెందిన ఇల్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి స్థానిక ఎమ్మార్వో విషయం తెలియజేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.