- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలగిరిలో రోడ్డు పై.. రైతుల ధర్నా...
దిశ, తిరుమలగిరి : తిరుమలగిరి మార్కెట్లో హామాలీలు, ఖరీదు దారుల గొడవతో టెండర్లు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైయ్యాయి. పూర్తివివరాల్లోకెళితే బుధవారం రైతులు ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకొచ్చారు. రోజువారీ టెండర్ల కంటే దాదాపుగా నాలుగు గంటలు ఆలస్యమైనా టెండర్లు మొదలు పెట్టకపోవడంతో రైతులు మార్కెట్ ముందు సూర్యపేట - జనగాం రోడ్డు పై రాస్తారోకోకు దిగారు. స్థానిక తహాశీల్దార్ హరిప్రసాద్, ఎస్సై సురేష్, మార్కెట్ కార్యాలయానికి వచ్చి రైతులతో మాట్లాడి సమస్య గురించి తెలుసుకున్నారు. నాలుగు గంటలు కావస్తున్న ఇప్పటి వరకు కాంటాలు వేయలేదని చెప్పడంతో కార్యదర్శి శ్రీధర్ తో వారు మాట్లాడారు. దీంతో ఖరీదార్లు, హమాలీల మధ్య ఉన్న గొడవ బయటకు వచ్చింది. ఖరీదు దారులు సిల్క్ బస్తాలు ఇస్తామని చెప్పగా హమాలీలు సిల్క్ బస్తాలో కాంటాలు చేయలేమని గన్ని బస్తాలలో మాత్రమే కాంటాలు వేస్తామని చెప్పడంతో ఖరీదారులు టెండర్లు వేయడంలో జాప్యం చేశారని విషయం చెప్పారు.
గన్ని బస్తాల సమస్య గురించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే బాగుండదని ఏ విధంగానైనా కాంటాలు వేయాలని చెప్పారు. ఖరీదు దారులు, హమాలీ సమస్యను గురువారం చర్చించుకోవాలని చెప్పారు. టెండర్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఖరీదార్లు, హమాలీలు సమస్య చర్చించుకున్న తర్వాత మార్కెట్ అవుతుందని, అప్పటివరకు మార్కెట్ లావాదేవీలు జరగవని తహశీల్దార్, ఎస్సై చెప్పడంతో హమాలీలు ఆ షరతుకు ఒప్పుకొన్నారు. ఖరీదు దారులు టెండర్లు వేయడంతో హామలీలు ధాన్యాన్ని కొంత ఆలస్యంగా కాంటాలు వేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, ఖరీదుదారులు లక్ష్మయ్య, ఉపేందర్, సుధాకర్, నరసింహారెడ్డి, హమాలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.