- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే…
దిశ, సూర్యాపేట: నా రాజకీయ ప్రత్యర్ధులు నా ఎదుగుదలను ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నా రాజకీయ ప్రయాణం ఓ తెరిచిన పుస్తకమని, అది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పుడు కాంగ్రెస్ పెద్దలు తనతో మాట్లాడి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తనతో ఆ టికెట్ పై హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆ టికెట్‌ని ఇతరులకు కేటాయించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం పట్ల మరోసారి భంగ పడ్డాననే బాధ తనలో ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…. సీఎం రేవంత్ నా చిన్ననాటి మిత్రుడని, ఆయన పై నాకు ఎప్పటికీ విశ్వాసంతో పాటు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అందుకోసం నా చివరి శ్వాస వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించించారు. నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. అందుకు నన్ను ఎవరూ కూడా సంప్రదించలేదని తేల్చి చెప్పారు. ఎప్పటికైనా నాకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసీసీ, పీసీసీ నుండి స్పష్టమైన హామీ ఉందన్నారు. పార్టీ మార్పు ప్రచారం ప్రత్యర్థుల కుట్రలో భాగమన్నారు. కొన్ని మీడియాల్లో కావాలనే తన పై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, ఎలాంటి కారణాలు చూపకుండా వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్ట దావా వేసేందుకు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా, గోదాల రంగారెడ్డి, కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, నాయకులు గట్టు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, తండు శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, తదితరులు ఉన్నారు.