నల్లగొండలో భారీ భూకుంభకోణం బట్టబయలు.. తెరవెనుక రాజకీయ నాయకులు

by Javid Pasha |
నల్లగొండలో భారీ భూకుంభకోణం బట్టబయలు.. తెరవెనుక రాజకీయ నాయకులు
X

దిశ, నల్లగొండ: నల్లగొండలో భూబకాసురులు చెలరేగిపోతున్నారు. ఒక ఎకరం రెండు ఎకరాలే కాదు.. ఏకంగా వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇందులో తహసీల్దార్, నల్లగొండ మున్సిపల్ అధికారులు ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎలాంటి కట్టడాలు లేకపోయినా.. ఉన్నట్లు ఇంటి నెంబర్లతో సహా మున్సిపల్ అధికారులు వారికి ఇవ్వడం సూచనయంగా మారిపోయింది.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 370,371లో గల ప్రభుత్వ భూమిని కాజేయడానికి కొంతమంది రాజకీయ పెద్దలు, ప్రభుత్వ అధికారులు కుట్రలు పన్ని దానిని ఏకంగా కొంతమంది పేరుమీద వందల గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పేరిట కొంతమందికే ఈ స్థలాలను ఇష్టారాజ్యంగా కేటాయించారు. సర్వేనెంబర్ 370, 371లో ఇంటి నెంబర్ E1-2,6-2-52/1,6-1-32/1,6-1-29,6-3-48/1,6-2-41/1,6-2-49/1,C-1-2/1 కొన్ని ఇంటి నెంబర్లు మాత్రమే.. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఇల్లు లేని ఖాళీ స్థలాలకు కూడా మున్సిపల్ అధికారులులు, నల్లగొండకు సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం వారు ఈ నెంబర్లను ఇచ్చారు. ఇలా కొందరికే కాదు.. నల్గొండలో జరిగినటువంటి జీవో నెంబర్ 59,58కి సంబంధించి సుమారు 90% భూమిని ప్రభుత్వ అధికారులు వారి బంధుమిత్రులకు డబ్బులకు అమ్ముకున్నట్లు సమాచారం.

పేదలైన ఇల్లు లేని వారికి, ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటూ ఏళ్ల తరబడి అక్కడే ఉన్నవారికి ఈ 58, 59 జీవో ప్రకారం వారికి 75 నుండి 125 గజాల వరకు మాత్రమే భూమి అందిస్తారు. కానీ నల్లగొండలో విభిన్నంగా ఈ భూమాఫియా పెద్ద ఎత్తున వందల ఎకరాల్లో జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, భూకబ్జాకు పాల్పడిన అందరిపై చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు ఈ భూమిని అందజేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు కోరుతున్నారు. జర్నలిస్టుల పేరు మీద భూమి తీసుకున్న కొంతమంది పేరుపొందిన జర్నలిస్టులు వారంతర వారే సొంతంగా తిరిగి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఇస్తే అందరికీ వందగజాల నుంచి 120 గజాల వరకు నిరుపేదలైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చే విధంగా వారు కూడా కృషి చేయాలని, లేని పక్షంలో వారి మీద కోర్టులో కూడా న్యాయపరంగా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జర్నలిస్ట్ సంఘాల నాయకులు తెలిపారు.

ఇకనైనా గ్రహణం వీడేనా?

నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రభుత్వ భూమి అక్రమ క్రమబద్ధీకరణ చేసిన స్థలాలపై విచారణ చేపట్టి సంబంధిత మున్సిపల్ రెవిన్యూ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కన్నన్అ,డిషనల్ కలెక్టర్ ను జర్నలిస్ట్ సంఘాల నాయకులు కోరారు. కలెక్టర్ కు ఈ అక్రమ క్రమబద్దీకరణ జరిగిన భూముల మీద చర్యలు తీసుకొని పూర్తి విచారణ చేపట్టాలని కోరినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో విచారణ చేపడితే మాత్రం తీగలాగితే డొంకంతా కదిలినట్టు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారుల బాగోతం బట్టబయలయ్యే అవకాశం మాత్రం ఉంది. కొంతమంది ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారిని కూడా దారిద్యరేఖకు దిగువన ఉన్న వారిగా ధ్రువీకరించి వారికి కూడా ఈ ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ చర్యలో భాగంగా పట్టాను అందించినట్లు తెలుస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఈ భూ కుంభకోణంలో పెద్దన్న పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. నల్లగొండలోని జర్నలిస్ట్ లు కొంతమంది ఏకంగా 400 గజాల పై నుండి 800 గజాల వరకు ఈ ప్రభుత్వ భూమిని అక్రమ ధృవీకరణ పత్రాలతో వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వెంటనే ఈ రిజిస్ట్రేషన్లన్నీ నిలిపివేయాలని, వీలైనంత తొందరగా ఈ విషయంపై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కనల్గొండ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed