- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోమశిల నుంచి శ్రీశైలానికి కదిలిన లాంచి.. 80 మందితో ప్రయాణం..
దిశ, కొల్లాపూర్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమశిల నుంచి శ్రీశైలానికి శనివారం ఉదయం 11 గంటలకు క్రూజ్ లాంచీలో 80 మంది పర్యాటకులతో బయలుదేరింది. పర్యాటక శాఖ బ్రాంచ్ మేనేజర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో లాంచీ ప్రయాణమైంది. ఈ లాంచీలో సీట్ల సామర్థ్యం 120 మంది కాగా శనివారం మాత్రం 80 మందితో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీశైలానికి ఈ లాంచీ ప్రయాణం తొలిసారి. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీలో 90 కిలోమీటర్ల ప్రయాణం.
అయితే ఈ లాంచీ ఆదివారం సాయంత్రం తిరిగి సోమశిలకు చేరుకుంటుంది. అయితే ఈ లాంచీలో ఇద్దరు డ్రైవర్లతో వెళ్లిన 80 మంది పర్యాటకులకు మార్గమధ్యంలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం కల్పించనున్నారు. ఆంధ్ర పాపి కొండలకు దీటుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నల్లమల పాపి కొండలు ప్రకృతి అందాలను ఆరబోసిన దృశ్యాలను పర్యాటకుల హృదయాలను కట్టిపడేస్తాయి. కృష్ణమ్మ అలల పై చల్లటి గాలులలో లాంచీలో చేసే ప్రయాణం పర్యాటకులకు జీవితంలో మరపురాని ఘట్టమని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ సోమశిల కృష్ణానది అలలు, నల్లమల ప్రకృతి అందాలు తెలంగాణకు సోమశిల పర్యాటక కేంద్రం మరో ఊటీని తలపించనుంది.