Nuclear Warnings : అణ్వస్త్ర వార్నింగ్స్.. అమెరికాపై రష్యా సీరియస్‌

by Hajipasha |   ( Updated:2024-11-02 13:15:20.0  )
Nuclear Warnings : అణ్వస్త్ర వార్నింగ్స్.. అమెరికాపై రష్యా  సీరియస్‌
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్(Medvedev) అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రష్యా(Russia) ఇస్తున్న అణ్వస్త్ర వార్నింగ్స్‌(Nuclear Warnings)ను సీరియస్‌‌‌‌గా తీసుకోవడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధం ముప్పును నివారించాలని అగ్రరాజ్యానికి ఆయన సూచించారు.

‘‘మూడో ప్రపంచ యుద్ధం జరగాలని అమెరికా కోరుకోవడం లేదు. అయితే రష్యా అణ్వస్త్రాలను ప్రయోగించకుండా సహనంతో ఉండిపోతుందనే భ్రమలో వాళ్లు ఉన్నారు. అమెరికా ఆలోచన తప్పు. ఐరోపా దేశాలు కూడా ముందుచూపు లేకుండా వ్యవహరిస్తున్నాయి’’ అని దిమిత్రీ మెద్వెదేవ్ వ్యాఖ్యానించారు. ‘‘మా దేశం(రష్యా) ఉనికి గురించి మాట్లాడే క్రమంలో అధ్యక్షుడు పుతిన్ చాలాసార్లు అణ్వస్త్ర వార్నింగ్స్ ఇచ్చారు. మరో మార్గం కనిపించనప్పుడు మేం అణ్వస్త్ర ప్రయోగం చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story