- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్కేపురం నారాయణ స్కూల్‌లో ఘనంగా స్పోర్ట్స్ మీట్
దిశ, వెబ్ డెస్క్: పిల్లల్లకు చదువులతో పాటు క్రీడలను పలు పాఠశాలలు ప్రోత్సహిస్తున్నాయి. క్రీడలతో మెరుగైన ఆరోగ్యం సాధించేందుకు ప్రయత్నం చేస్తు్న్నాయి. ఇందులో భాగంగా ఆట పోటీలు నిర్వహిస్తున్నాయి. తద్వారా పిల్లల్లో శారీరక, మానసిక వికాశం కలుగుతుందని భావిస్తున్నాయి. ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి క్రీడల పట్ల పిల్లలను ఆకర్షితులను చేస్తున్నాయి.
హైదరాబాద్ ఆర్కేపురం నారాయణ పాఠశాల నిర్వాహకులు పిల్లలను ఆటల వైపు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో క్రీడా సమావేశం నిర్వహించారు. పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్ ఇన్‌స్ట్రక్టర్ సోమనాథ్ పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, ఆటల ప్రాముఖ్యతపై పిల్లలకు ఆయన వివరించారు. 10/10 జీపీఏ సాధించాలంటే మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఉండాలని చెప్పారు. పిల్లలకు స్కూల్లో స్పోర్ట్స్ క్లాసులు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలు టీవీలు, సెల్ ఫోన్లకు అలవాటుపడుతున్నారని, అది చాలా ప్రమాదకరమని తెలిపారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణించేలా పిల్లలను ఉపాధ్యాయులే కాదని, తల్లిదండ్రులు కూడా తయారు చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీ.ఎం.గోపాల్ రెడ్డి, ఏజీఎం హేమంబర్, ఆర్.యం.డి. మహేశ్వరి మీనా, ప్రిన్సిపల్ నీరజ, వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత, టీచర్ శ్రావణి, ఆర్. ఐ. రవి ప్రసాద్, సమన్వయకర్తలు శరత్ బాబు, గాయత్రి, శిరీష, ఏ.ఓ. రమేష్, ఏడి స్వామి, పదో తరగతి ఇన్చార్జి యుగంధర్ పాల్గొన్నారు.