- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. విద్యా కమిషన్ చైర్మన్
దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం కలెక్టరేట్ ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎంఈఓ కేజీబీవీలు, డీఈఓలతో విద్యా వ్యవస్థ పై సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తున్నారని అందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసేందుకు సూచనలు ఇవ్వాలని కోరారు. పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.
ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్య ఉందని విద్యార్థుల నిష్పత్తి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు కళాశాలలకు వెళ్ళేందుకు రవాణా సౌకర్యం కూడా కావాలన్నారు. పలు రంగాల నుండి సూచనలు సలహాలు స్వీకరించి ముఖ్యమంత్రికి నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారి పాఠశాలలో కళాశాలలో ఉన్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులను బడికి పంపే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు చేయాలని అలాగే జూనియర్ కళాశాలలో విస్తరించాలన్నారు. గద్వాలలో డైట్, డీఈడీ కళాశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. కళాశాలలకు హాస్టల్ వసతి కల్పించాలన్నారు. కమిషన్ సభ్యులు జోష్ణ, శివారెడ్డి, చారకొండ వెంకటేష్, విశ్వేశ్వరయ్య మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని జిల్లాకు ప్రత్యేకంగా విద్యా ప్యాకేజీ ప్రకటించాలని కమిషన్ కు సూచించారు. ఈ సందర్భంగా 109 సమస్యలు విన్నవించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ జిల్లాలో పర్యటించి అక్షరాస్యతా శాతం పెంచేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఇంకా ఏవైనా సలహాలు సూచనలు ఉంటే, tec [email protected] కు సలహాలు పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, కమిషన్ సభ్యులు పీఆర్ఓ జ్యోష్ణ, శివారెడ్డి, రాచకొండ వెంకటేష్, విశ్వేశ్వరయ్య, యంబీ ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రియాంక, ఎంఈఓలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.