- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా నల్ల బెల్లం పట్టివేత
దిశ, తిరుమలగిరి (సాగర్) : నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలోని జమ్మనకోట తండాలో అక్రమ రూ.3 లక్షల విలువ చేసే నల్ల బెల్లం పట్టుకున్నారు. అక్రమంగా ఒకచోట నల్లబెల్లం దాసి ఉంచారనే సమాచారం మేరకు..గురువారం హైదరాబాద్ కు చెందిన ఎస్టిఎఫ్ టీం లీడర్ ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి బెల్లంగోదాంపై దాడులు నిర్వహించి,తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 300 కేజీల బెల్లం 50 కేజీల ఆలం,10 లీటర్ల నాటు సారా పట్టుబడింది. ఆంధ్రకు చెందిన గుంటూరు మాచర్ల కు చెందినటువంటి కృష్ణా నాయక్ అనే ఒక వ్యక్తి నాటు సారా తయారీ కోసం వినియోగించే నల్ల బెల్లాన్ని అమ్మకాల కోసం గోదాంలో దాచిపెట్టి ఉంచారన్నారు. పట్టుబడిన నల్ల బెల్లం విలువ రూ. మూడు లక్షలు ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎస్టిఎఫ్ బాలరాజు సిబ్బంది, హలియా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ కల్పన,ఎస్సై సంపత్ పాల్గొన్నారు. బెల్లం పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావులు అభినందించారు.