రేవంత్‌ను క్షమించు దేవుడా అని కోరుకున్న...హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Aamani |
రేవంత్‌ను క్షమించు దేవుడా అని కోరుకున్న...హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : తెలంగాణ ప్రజల మొహం చూసి రేవంత్ ను క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నా అని మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అనంతరం హరిత హోటల్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తామని మోసం చేసిందన్నారు. రైతులు, అన్ని వర్గాల పక్షాన పోరాడే శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరాను అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మూడు వందల రోజులు వచ్చినా అమలు కాలేదన్నారు. ఎంత మందికి రుణమాఫీ చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద 7500 కోట్లు గతంలో కేసీఆరే ఇచ్చారు అన్నారు. స్పీకర్, ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి చిన్న చిన్న ఉద్యోగులకు ఎందుకు కోత పెడుతున్నావు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయొద్దు అని హితవు పలికారు. డిసెంబర్ తొమ్మిదినే రుణమాఫీ చేస్తామన్నావు ఏమైంది రేవంత్ అని ప్రశ్నించారు.

మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదని ఏ ఊరుకి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు పెట్టావు అని విమర్శించారు. లక్ష్మీ నరసింహ స్వామి పై ఒట్టు పెట్టి మాట తప్పావు....పాలకుడు మాట తప్పితే ప్రజలకు పాపం తగలోద్దని రేవంత్ ను క్షమించాలని వేడుకున్నాం అన్నారు. ప్రపంచం తలకిందులు అయినా ఆగష్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామని అనలేదా రేవంత్ అన్నారు. రైతులనే కాదు దేవుడిని రేవంత్ మోసం చేశాడన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది అని పార్టీ మారిన చరిత్ర నీది అని విమర్శించారు. రేవంత్ రుణమాఫీ అయింది అంటున్నాడు. మంత్రులు కాలేదని అంటున్నారు...ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల రుణమాఫీ పూర్తిగా కాలేదని అంటున్నారు అని అన్నారు. 42 లక్షల మందిలో 20 లక్షల మందికే రుణమాఫీ అయిందని 46 శాతం మాత్రమే రుణమాఫీ అయింది అన్నారు. దేవుళ్లపై ప్రమాణం చేసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ది అన్నారు. బహిరంగంగా రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుళ్ళ వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాలలని హితవు పలికారు. రేవంత్ ఏ చోట ప్రమాణం చేశాడో అన్ని చోట్లకు పోతామని రేవంత్ దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed