- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ అనిశ్చితి ఏర్పడిన వేళ అక్కడ హిందువులు (Hindus), క్రైస్తవుల (Christians)పై అల్లరి మూకలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Former US President Donald Trump) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై అనాగరిక హింసను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బంగ్లాదేశ్ (Bangladesh)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ ఒకరిపై ఒకరు గుంపులుగా ఏర్పడి పరస్పరం దాడులకు తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు.
తాను అధికారంలో ఉన్న నాడు ఇలాంటి పరిణామాలు ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), కమలా హారిస్ (Kamala Harris) లు ప్రపంచ వ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ (Israel) నుంచి ఉక్రెయిన్ (Ukraine) అక్కడి నుంచి తమ దక్షిణ సరిహద్దు వరకు యుద్ధ వాతావరణం నెలకొని ఉందని అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే.. అమెరికా (America)ను బళ్లీ బలమైన శక్తిగా తయారు చేస్తామని తెలిపారు.
రాడికల్ లెఫ్ట్ (Radical Left), మత వ్యతిరేక ఎజెండా ఉన్న సంఘ విద్రోహ శక్తుల నుంచి హిందూ అమెరికన్లను రక్షిస్తామని అభయమిచ్చారు. తాము నిరంతరం స్వేచ్ఛ కోసమే పోరాడతామని, ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సారథ్యంలోని భారత్ తమకు చిరకాల మిత్రుడితో సమానమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘అలాగే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లైట్స్ ఫెస్టివల్ చెడుపై మంచి విజయానికి దారి తీస్తుందని నేను ఆశిస్తున్నా..!’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.