AP News:రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం పై మంత్రి కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-11-01 07:33:41.0  )
AP News:రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం పై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేడు(శుక్రవారం) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని(Free gas cylinders scheme) శ్రీకాకుళం జిల్లా, ఈదుపురంలో ప్రారంభించనున్నారు. ఈ విధంగా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే నెరవేరుస్తామన్న ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పై తాజాగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) కీలక ప్రకటన చేశారు.

సంక్రాంతిలోపు ఆర్టీసీ బస్సుల్లో(RTC) మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్(Super Six) పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం(AP Government) ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తుందన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం మంత్రి జనార్ధన్ రెడ్డి గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్.. చంద్రబాబు ప్రభుత్వం పై మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed