Minister Tummala Nageswara Rao: కొనుగోళ్లలో అవకతవలు జరిగితే సహించే ప్రసక్తే లేదు

by Gantepaka Srikanth |
Minister Tummala Nageswara Rao: కొనుగోళ్లలో అవకతవలు జరిగితే సహించే ప్రసక్తే లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర సచివాలయం(Secretariat) వేదికగా మార్కెటింగ్ శాఖ(Marketing Department) అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్, మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాట్సాప్(8897281111) ద్వారా రైతులు(Telangana Farmers) సేవలు ఉపయోగించుకోవాలని సూటించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలు పడుతున్నందున అధికారులతో పాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పత్తి కొనుగోళ్ల(Cotton Purchases)లో అవకతవకలు జరిగితే తక్షనమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed