Bandi Sanjay : అప్పుడు హామీ.. ఇప్పుడెందుకు జిల్లాల తగ్గింపు? ఎక్స్‌లో బండి సంజయ్ ప్రశ్న

by Ramesh N |
Bandi Sanjay : అప్పుడు హామీ.. ఇప్పుడెందుకు జిల్లాల తగ్గింపు? ఎక్స్‌లో బండి సంజయ్ ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా, మండల పునర్వ్యవస్థీకరణను సమీక్షిస్తానని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో వాగ్దానం ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. జిల్లా, మండల పునర్వ్యవస్థీకరణ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడెందుకు జిల్లాల తగ్గింపునకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రశ్నించారు.

కాగా, పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం 33 జిల్లాలుగా విస్తరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, అవసరమైతే సంఖ్యను తగ్గించాలని సూచించేందుకు న్యాయకమిషన్‌ను కూడా నియమించాలని ప్రభుత్వం బావిస్తున్నట్లు సీఎం గతంలో మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed