Milk : పాలు తాగినా ఊబకాయం పెరుగుతుందా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

by Javid Pasha |   ( Updated:2024-11-01 07:22:46.0  )
Milk : పాలు తాగినా ఊబకాయం పెరుగుతుందా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. శరీరంలో కొవ్వుశాతం పేరుకుపోవడం కూడా ఇందుకు దారితీస్తుంది. అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నవారు తీసుకునే ఆహారాలు, పానీయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. కాగా చాలా మంది పాలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాటివల్ల ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటారు. అయితే ఊబకాయం సమస్య ఉన్నప్పుడు మాత్రం దానిని మరింత ప్రోత్సహించే పానీయాల్లో పాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం.

వాస్తవానికి పాలు సంపూర్ణ ఆహారం. అందుకే డైలీ ఒక గ్లాస్ తాగాలని చెప్తుంటారు నిపుణులు. దీనివల్ల శరీరంలో కాల్షియం లెవల్స్ పెరుగుతాయి. ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు కూడా పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అయితే ఇలాంటి పోషకాలతోపాటు కేలరీలు కూడా అధికంగానే ఉంటాయి కాబట్టి తరచుగా తాగుతూ ఉంటే అధికబరువు లేదా ఊబకాయం సమస్య మరింత అధికం అవుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రోజూ పాలు తాగేవారు వాటిలో కేలరీలను తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అంటే పాల నుంచి మీగడను తీసివేసి తాగడంవల్ల కేలరీలు తగ్గుతాయి. దీంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed