ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి : జిల్లా సంక్షేమ అధికారి..

by Sumithra |
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి : జిల్లా సంక్షేమ అధికారి..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి అన్నారు. బుధవారం పోచంపల్లి మండలం జలాల్పురం కస్తూర్భా గాంధీ పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యకలాపాల్లో భాగంగా గ్రంధాలయాన్ని ప్రారంభించారు.

ఈ రోజు సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని, పౌష్టిక ఆహారం తీసుకొని రక్తహీనతను తగ్గించాలని, ప్రణాళికాబద్ధంగా చదువుకొని లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా మిషన్ కో - ఆర్డినేటర్ హర్ష , బృందం భార్గవి, నిఖిత, మనీషా, ప్రత్యేక అధికారి ఇందిర, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story