- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే మునుగోడుకు నిధులు మంజూరు
దిశ, మర్రిగూడ : మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి దిగివచ్చి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అత్యధికంగా నిధులు విడుదల చేశాడని కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రామ్ రెడ్డి పల్లి, తానేదారి పెళ్లి, వెంకేపల్లి, కుదబక్షపల్లి, శివన్నగూడెం, అంతంపేట గ్రామాలలో ఆమె గడపగడపకు ప్రచారం చేసి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. తానేదారుపల్లి చావడి వద్ద ఓటర్లను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహా ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారెంటీల అమలుతో ప్రతి కుటుంబం సంక్షేమంలో ముందంజలో ఉంటుందని తెలిపారు. కేసీఆర్ మాటల గారడికి ప్రజలు మోసపోకుండా చేతి గుర్తు పైన ఓటు వేసి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట మండల కాంగ్రెస్ నాయకులు వెన్నమనేని శోభా రవీందర్రావు, రాందాస్ శ్రీనివాస్, వెంకటంపేట బాలయ్య, బేత వెంకటేష్ తదితరులు ఉన్నారు.