- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ జడ్పీటీసీ
దిశ,నల్లగొండ: తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పైన దుర్భాషలాడిన,సంపుతానని బెదిరించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.సోమవారం డాక్టర్ చెరుకు సవాహస్ మాజీ జిడ్పిటిసి తండు సైదులు గౌడ్,కాంగ్రెస్ ఎస్సి.సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్,బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీ నారాయణ తో కలిసి జిల్లా ఎస్పీ గారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై పిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయలేదని అతని అరెస్టు చేయలేదని అందుకే జిల్లా ఎస్పీని కలిసి విన్నవించామన్నారు.తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరెస్ట్ చేసి చెరుకు సుధాకర్ కు చెరుకు సుధాకర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో ఏ బహుజన నాయకుడు ఎదిగినా ఓర్వనితనం వెంకట్ రెడ్డి ది అన్నారు.
చెరుకు సుధాకర్ కు పిసిసి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిట్టకనే ఈ తథంగానికి తెరలేపారు అన్నాడు. ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి నీతి నిజాయితీ విలువలు లేకుండా అహంభావంతో అహంకారపూరితంగా ఒక ఉద్యమకారునిపై మాట్లాడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా స్పందించాలన్నారు. వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి చెరుకు సుధాకర్ నన్ను తిట్టాడని ఊరికే పదేపదే అనడం కంటే ఏమన్నాడో మీడియా ముందు రుజువు చేయాలని డిమాండ్ చేశాడు. నీ చిల్లర మాటలు ప్రజలు గమనిస్తున్నారని నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.చెరుకు సుధాకర్ కుమారుడు డాక్టర్ చెరుకు సువాస్ మాట్లాడుతూ మా కుటుంబానికి వెంకటరెడ్డి నుండి ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తక్షణమే అరెస్టు చేయాలని కూడా కోరడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, తెలంగాణ గౌడ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్,గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వడ్డే బోయిన సైదులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్,బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ వినోద్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగు నరేష్ గౌడ్, శ్రీ గౌడ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్ యూసూఫ్,జాకీర్ తదితరులు పాల్గొన్నారు.