వాళ్ల సంగతి చూద్దాం.. రైతులకు కేసీఆర్ భరోసా

by Anjali |   ( Updated:2024-04-26 14:08:27.0  )
వాళ్ల సంగతి చూద్దాం.. రైతులకు కేసీఆర్ భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లీ విగ్రహానికి పూల మాలలు వేసి కేసీఆర్ నేడు బస్సు యాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో మిర్యాలగూడ మార్గమధ్యంలో నల్గొండ బైపాస్ రోడ్డులో ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద రైతులను చూసి కేసీఆర్ బస్సు ఆపారు. రైతులు కేసీఆర్ దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. రైతు రుణమాఫీ లేదు. రైతులకు భూమి లేదు. రైతులను పట్టించుకోనేవారే లేకుండా పోయారని రైతులు వాపోయారు. కరెంట్ లేదు. చెర్ల నీళ్లు తాగుదామన్నా నీరు లేదని అన్నారు. బీఆర్ఎస్ పాలననే బాగుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ధైర్యం కోల్పోవద్దు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేవరకు పోరాటం చేద్దాం. వాళ్ల సంగతి చూద్దామని కేసీఆర్ రైతులకు ధైర్యం చెప్పారు.

CLICK HERE FOR TWITTER VIDEO

Advertisement

Next Story