Cybercrime Alert: రుణమాఫీ విషయంలో రైతులు సైబర్ నేరస్థుల వలలో పడొద్దు

by Mahesh |
Cybercrime Alert: రుణమాఫీ విషయంలో రైతులు సైబర్ నేరస్థుల వలలో పడొద్దు
X

దిశ, కోదాడ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీని అదనుగా తీసుకొని సైబర్ నేరస్థులు బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలో బ్యాంకు లోగో లతో వాట్సాప్‌లో బ్లూ కలర్ లో కొన్ని మోసపూరితమైన లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారి పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా వ్యక్తులు సైబర్ నేరగాల్లు పంపిన లింక్‌లు టచ్ చేసిన లేక డౌన్లోడ్ చేసుకున్న వారి వాట్సాప్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌కు వెళ్లి పోతుందన్నారు. అంతే కాకుండా కాంటాక్ట్‌లో వున్న ప్రతి ఒక్కరికి మనం పంపినట్లే తప్పుడు మెసేజ్ వెళ్ళ్తున్నదన్నారు. తద్వారా మీకు తెలిసిన వాళ్ల నుంచి మీ పేరుతో డబ్బులు పంపించమని వాట్సప్ ద్వారా కోరుతున్నారని తెలిపారు.

గుర్తు తెలియని బ్లూ కలర్ లింకులను గాని లేదా ఏపీకే ఫైల్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే, సైబర్ నేరస్థులు మీ గూగుల్, ఫోన్ పే యూపీఐ ఐడీల ద్వారా మీకు తెలియకుండానే డబ్బులు దోచేసే ప్రమాదం ఉందన్నారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యొద్దన్నారు. ఏదైనా కారణంతో వాట్సాప్ అకౌంట్ పనిచేయకుంటే వెంటనే వాట్సాప్ అప్లికేషన్‌ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకొని ఆక్టివేట్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ సైబర్ మోసాలకు గురి అయితే ఎప్పుడైనా వెంటనే 1930 కి కాల్ లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలన్నారు. నేరం జరిగిన తర్వాత ఎంత త్వరగా పై నెంబర్ కి కాల్ చేసి రిపోర్టు చేస్తే అంత త్వరగా డబ్బులు సైబర్ చేతిలో పడకుండా కాపాడే అవకాశం ఉంటుందని డీఎస్సీ తెలిపారు.



Next Story