వరద కాలువకు నీళ్లు వదలాలని మాడుగుల పల్లిలో రైతులు ఆందోళన

by Mahesh |
వరద కాలువకు నీళ్లు వదలాలని మాడుగుల పల్లిలో రైతులు ఆందోళన
X

దిశ, మాడుగుల పల్లి: వరద కాలువ నీళ్లు వదలాలని మాడుగుల పల్లి మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు. కాలువకు ఉన్న తూములను వెంటనే క్లోజ్ చేసి కాలువలో పిచ్చి చెట్లను తాటి చెట్లను తొలగించి కాలువ చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరద కాలువకు నీళ్లు వదిలి 20 రోజులు గడుస్తున్నప్పటికీ మాడుగులపల్లి మండలానికి ఇంతవరకు నీరు చేరుకోవడం లేదని రైతులు చాలా నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ చివరి ఆయకట్టు వరకు సాగు నీరు చేరే విధంగా కృషి చేయాలని రైతులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed