- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
cracker shops : లెక్కకు మించి.. నగరంలో ఇష్టారాజ్యంగా క్రాకర్స్ షాపులు..
దిశ, హైదరాబాద్ బ్యూరో : దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో నగరంలోని క్రాకర్స్ దుకాణాలలో చోటు చేసుకుంటున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా వేల సంఖ్యలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తుండగా నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం చోటు చేసుకుంటుంది. బొగ్గులకుంటలోని పరాస్ కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదాన్ని మరువక ముందే గంటల వ్యవధిలో పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పటాకులు నిల్వ ఉంచిన ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సంఘటనలో ఇద్దరు నిద్రలోనే అగ్నికి ఆహుతి కాగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ రెండు సంఘటనలు క్రాకర్స్ వ్యాపారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అనుమతులు పొంది అందుకు విరుద్ధంగా వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నవారు కొంతమందైతే, మరికొంతమంది అనుమతులు లేకుండానే ఎక్కడపడితే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని తనిఖీ చేయడం, నియంత్రించడంలో ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది, మరోవైపు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ఇండ్లలో గుట్టుచప్పుడు కాకుండా, పక్కవారికి కూడా తెలియకుండా క్రాకర్స్ భారీ ఎత్తున నిల్వ ఉంచుతుండడం ప్రమాదాలకు కారణమౌతుండగా పాతబస్తీలో చోటు చేసుకున్న సంఘటన రుజువుగా నిలుస్తోంది.
అనుమతులు ఉన్నవి 6,104 మాత్రమే..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఫైర్ విభాగం అనుమతులు పొంది ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలు కేవలం 6,104 మాత్రమే ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం పర్మినెంట్ ఫైర్ క్రాకర్స్ గోదాముల కోసం 58 దరఖాస్తులు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమెర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు వచ్చాయి. వీటిల్లో 2 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 51 గోదాములకు అనుమతులు ఇచ్చారు. మరో 5 రిజెక్ట్ అయ్యాయి. 100 కేజీల నుంచి 300 కిలోల లోపు పర్మినెంట్ ఫైర్ క్రాకర్స్ హోల్ సేల్ దుకాణాల అనుమతి కోసం 129 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 114కు అనుమతులు జారీ చేయగా 5 పెండింగ్‌లో ఉన్నాయి. 10 రిజెక్ట్ అయ్యాయి. అలాగే హోల్ సేల్‌గా 100 కిలోల నుంచి 300 కిలోల లోపు ప్రపోస్డ్ పర్మినెంట్ ఫైర్ క్రాకర్స్ ఏర్పాటు కోసం 64 దరఖాస్తులు రాగా 6 పెండింగ్‌లో ఉన్నాయి.
మరో 6 రిజెక్ట్ చేయగా 52 దుకాణాలకు అధికారులు అనుమతులు జారీ చేశారు. ఇక తాత్కాలికంగా ఫైర్ క్రాకర్స్ దుకాణాల కోసం 6,685 దరఖాస్తులు రాగా 5,876 దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. 660 దుకాణాల అనుమతులు పెండింగ్‌లో పెట్టగా 149 దరఖాస్తలు రిజెక్ట్ చేశారు. ఈ గణాంకాలే అధిక సంఖ్యలో అనుమతులు లేని క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేశారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ తాత్కాలిక ఫైర్ క్రాకర్స్ దుకాణాలు దర్శనమిస్తున్నాయి.
అధికారులు చర్యలు తీసుకోవాలి..
అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాలను వెంటనే మూసివేయాలని, అనుమతులు పొందిన వారు కూడా నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనేది ఫైర్ విభాగం అధికారులు, స్థానిక పోలీసులు తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, లాభార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన వాటిని మూసి వేయాలని, దీపావళి సమీపంలో మరిన్ని అగ్నిప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.