- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
purchase centers : ధాన్యం రైతు గోస.. కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం..
రైతాంగం అరిగోస పడుతున్నది. సెంటర్లకు వడ్లు తెచ్చి ఇరువై రోజులైనా కొనకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. అటు ధాన్యాన్ని కాపుకాయలేక, అకాల వర్షానికి కాపాడుకోలేక ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడ కండ్ల ముందే వడ్లు తడిసిపోతుండడంతో ఆవేదన చెందుతున్నారు. కొద్ది రోజుల నుంచి ముప్పు వెంటాడుతున్నా పట్టించుకునే వారు లేక రైతులు ఆగ్రహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉండగా, సకాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు. వర్షానికి తడువకుండా టార్పాలిన్లతో కాపుకాస్తున్నారు. రోజులు గడుస్తున్నా కొనకపోవడం, అకాల ముప్పుతో ధాన్యం తడిసిపోతుండడంతో కొందరు రైతులు తక్కువ డబ్బులకు దళారులకు విక్రయించుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఇంత గోస పెట్టవద్దని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దిశ, కామారెడ్డి : ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఆరబెట్టి కుప్పలు పోసుకొని 20 రోజులైనా కాంటా పెట్టడం లేదు... సంచి నింపడం లేదు... ఇదేమిటని అడిగితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవు మేమేమి చేయాలంటూ స్థానిక సిబ్బంది రైతులకు చెబుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 419 కొలువలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 27 ఐకేపీ, వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 392 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటిని కూడా నామమాత్రంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా కాంటాలు ప్రారంభించలేదంటే అధికారుల అలసత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కనీసం కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లుల అలాట్మెంట్ కూడా ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఆటు ఉంచితే కనీసం సమయానికి కొనుగోలు చేసి రైతులను ఆదుకుందామన్న ఆలోచన ప్రభుత్వానికి, యంత్రాంగానికి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షానికి తడిసిన వారి ధాన్యం...
కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయింది. గత 20 రోజులుగా వరి కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకోగా ఒక్కసారిగా వర్షం కురవడంతో అన్నదాత ఆగమాగం అయ్యాడు. అయినా ధాన్యం వర్షార్పణం అయింది.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి...
కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకువచ్చిన ధాన్యం ఆరబెట్టుకొని కాంటాలకు సిద్ధం చేయగా వర్షానికి ధాన్యం తడిసిపోయిందని, దీనిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని రైతులకు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వెంటనే ప్రారంభించాలి...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు వెంటనే కాంటాలు ప్రారంభించి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతుల కోరుతున్నారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి ధాన్యం తరలించాలి...
ఇప్పటి వరకు జిల్లాలోని ఏ రైస్ మిల్లుకు కూడా ధాన్యం అలాట్మెంట్ ఇవ్వలేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇస్తే తప్ప కాంటాలు కావని, కాంటాలు అయిన ధాన్యం రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి రైస్ మిల్లులకు అలాట్మెంట్ కేటాయించి కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరుతున్నారు.