- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
journalists : జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి..
దిశ, హుజూర్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రముఖ చానెల్ రిపోర్టర్ పై హత్యాయత్నానికి నిరసనగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టుల పై దాడులు జరిగితే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. రిపోర్టర్ సందీప్ పై కత్తులతో హత్యాయత్నం చేసిన వ్యక్తులను, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అయ్యప్ప స్వామి మాల ధరించిన సందీప్ ను కత్తులతో దాడి చేసి గాయపడిన మతతత్వ వ్యక్తులను అరెస్టు చేసే శిక్షించాలన్నారు. జర్నలిస్టుల పై దాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో జర్నలిస్టుల రక్షణ చట్టంపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ చరమందరాజులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దొంతగాని రాజా రమేష్, బసవొజు శ్రీనివాస చారి, త్రిపురం రమేష్ రెడ్డి దుగ్గి ఉషశ్రీ ,పండ్ల నాగరాజు కిత రామనాథం, రాంప్రసాద్ గౌడ్,జానీ పాషా, నక్క నరేష్ గౌడ్,నాగుల్ మీరా, ఆత్కూరి వెంకటేశు, శక్తిటీవీ మధు, వి6 నరేష్ , దేవర వెంకటరెడ్డి, కాంపాటి సందీప్, తండు నరేష్, పండు వెంకన్న, , ఇట్టుమల్ల రామకృష్ణ, నరేందర్, పెందుర్తి సతీష్, బండి నాగేశ్వరావు, జట్టి తేజస్, వట్టికూటి మహేష్ , పాల్గొన్నారు.