జర జాగ్రత్త.. పెళ్లిళ్ల సీజన్ వేళ నకిలీ నోట్ల కలకలం..

by Sumithra |
జర జాగ్రత్త.. పెళ్లిళ్ల సీజన్ వేళ నకిలీ నోట్ల కలకలం..
X

దిశ,చండూరు: గత కొన్ని రోజులుగా మున్సిపల్ కేంద్రంలోని మద్యం దుకాణాలకు నకిలీ నోట్లు వస్తున్నట్లు మద్యం దుకాణాల నిర్వాహకులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇవి ఇవ్వగా.. వైన్స్ సిబ్బంది తీసుకొని తర్వాత నకిలీ నోట్లగా గుర్తించారు. వాటిలో వంద రూపాయల నోట్లు మూడు, రెండు వందల రూపాయల నోట్లు రెండు, ఐదు వందల రూపాయల నోట్లు రెండు, రెండు వేల రూపాయల నోట్లు ఒకటి చొప్పున నకిలీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావటంతో ఇతర వ్యాపార సముదాయాల వద్ద కూడా నకిలీ నోట్ల చలామణి జరిగే అవకాశం ఉండటంతో. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుండి చండూరుకు వస్తున్నాయో పోలీసులు నిఘా ఉంచాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed