మల విసర్జన బహిర్గతమాయే.. దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికులు!

by Geesa Chandu |
మల విసర్జన బహిర్గతమాయే.. దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికులు!
X

దిశ, కొండమల్లేపల్లి: అసలే వర్షాకాలం కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్న వేళ, మలవిసర్జన బహిర్గతంగా విచ్చలవిడిగా చేస్తున్నారు. ప్రజల బస్సు దిగిన వెంటనే పక్కనే ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లకుండా బస్టాండు ఎదురుగా ఖాళీగా ఉన్న ప్లేస్ లోనే మలవిసర్జన చేస్తున్నారు. దాని పక్కనే ప్రయాణికులు కూర్చునే బెంచీలు ఉన్నాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్న స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ లో వచ్చిపోయే ప్రయాణికులు అందరూ బస్సు దిగిన వెంటనే పక్కన ఉన్న మరుగుదొడ్లోకి వెళ్లకుండా అక్కడే ప్రయాణికులు కూర్చున్న దాని పక్కనే మలవిసర్జన చేయడం వల్ల దుర్వాసనతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

లక్షల వ్యయంతో కట్టించిన మరుగుదొడ్లలోకి వెళ్లకుండా.. కొంతమంది నిర్లక్ష్యంతో రోడ్లపైనే మలవిసర్జన చేస్తున్నారు. స్త్రీలు పక్కనే రోడ్డుపై ఉన్నా కూడా వాళ్ళని చూసి చూడనట్టు ఉండి అలాగే కళ్ళు మూసుకొని రోడ్డు పైనే మలవిసర్జన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా పలు విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి మలవిసర్జన దుర్వాసనతో ఆ యొక్క జబ్బులు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. సంబంధిత సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ లో కూడా ఉన్న రోడ్డు పక్కన మలవిసర్జన చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed