ప్రముఖుల గ్రామాల్లో సైతం కాంగ్రెస్ దే మెజార్టీ..

by Sumithra |
ప్రముఖుల గ్రామాల్లో సైతం కాంగ్రెస్ దే మెజార్టీ..
X

దిశ, తుంగతుర్తి : తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ కు వచ్చిన భారీ మెజార్టీ వెనక అనేక విశేషాలు లేకపోలేదు. నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి, మోత్కూరు, అడ్డ గూడూరు, శాలిగౌరారం, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ (తొమ్మిది) మండలాలలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల గ్రామాలలో సైతం కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ చేకూరింది.

మోత్కూరు మండల కేంద్రానికి చెందిన ఆయిల్ షెడ్ సంస్థ రాష్ట్ర చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మద్దిరాల మండల కేంద్రానికి చెందిన సూర్యాపేట జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ రజాక్, తూర్పుగూడెం గ్రామానికి చెందిన సూర్యాపేట జడ్పీచైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, గొట్టిపర్తి గ్రామానికి చెందిన బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్, వెలుగుపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి స్వగ్రామం నాగారంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది.

Advertisement

Next Story

Most Viewed