వార్త విశ్లేషణలో చురుకైన పాత్ర దిశ సొంతం : నల్లగొండ డీపీఆర్వో వెంకటేశ్వర్లు..

by Sumithra |
వార్త విశ్లేషణలో చురుకైన పాత్ర దిశ సొంతం : నల్లగొండ డీపీఆర్వో వెంకటేశ్వర్లు..
X

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా పౌర సమాచార అధికారి వెంకటేశ్వర్లు దిశ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. వారి మాట్లాడుతూ ఎప్పటి వార్తలు అప్పుడు అందిస్తూ పత్రిక రంగంలో చురుకైన పాత్ర వహిస్తుందని ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు క్షణాల్లో అందరికీ అందిస్తూ అందరి మన్ననలు చురకొంది దిశ అన్నారు. అలాగే వార్త విశ్లేషణలో కూడా స్పష్టతతో వస్తుందని, దిశ పత్రిక రంగంలో ఇలానే కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశ నల్లగొండ నియోజకవర్గ ఇంఛార్జి ఓడపల్లి మధు, కనగల్ రిపోర్టర్ నాగయ్య, కొండమల్లెపల్లి రిపోర్టర్ రవి, నల్లగొండ టౌన్ రిపోర్టర్ మధు, కార్యాలయ సిబ్బంది, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed