- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్..మూన్నాళ్ళ ముచ్చటే కథనానికి అపూర్వ స్పందన..
దిశ,సూర్యాపేట టౌన్; సూర్యాపేట పట్టణంలోని ఆయా ప్రధాన జంక్షన్ ల్లో ఏర్పాటు చేసిన లైట్స్,ఫౌంటెన్ల సుందరీకరణ చిత్రాలపై సూర్యాపేట మున్సిపాలిటీ అధికారులు దృష్టి సారించకపోవడంతో..అవి అలంకారప్రాయంగా మారాయి. దీంతో లక్షల రూపాయలు హెచ్చించి ఏర్పాటు చేసిన సుందరీకరణ చిత్రాలు మరుగున పడటంతో..మంగళవారం దిశ దిన పత్రిక మూన్నాళ్ళ ముచ్చటే కొద్ది రోజులే జంక్షన్ ల హంగామా అనే శీర్షికను ప్రచురితం చేసింది. ఈ కథనానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్ స్పందించారు. సూర్యాపేట ప్రధాన కూడలి లలో ఏర్పాటు చేసిన సుందరీకరణ దృశ్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట అభివృద్ధిలో భాగంగా ఏర్పాటుచేసిన సుందరీకరణ దృశ్యాల పై ప్రత్యేక దృష్టి సారించి..నిరంతరం పర్యవేక్షించాలని ఆయన అధికారులను సూచించారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు సుందరీకరణ దృశ్యాలు లైట్స్ పై, వాటర్ ఫౌంటెన్ల పై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పునరుద్ధరించారు. దీంతో సూర్యాపేట ప్రధాన జంక్షన్లు కళ కళలడుతున్నాయి. కళకళలాడుతున్న జoక్షన్లను చూసి పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కి, దిశ దినపత్రికకు పట్టణ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.