దిశ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు

by Naveena |
దిశ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు
X

దిశ, గాంధారి: బ్రిడ్జిపై వెళ్లాలంటే భయం భయం అనే దిశ కథనానికి స్పందించిన గ్రామపంచాయతీ సెక్రటరీ బ్రిడ్జికి ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీ నాగరాజు మాట్లాడుతూ.. గాంధారి అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతామని ,సమస్యల ఉంటే వాటిని పరిష్కారిస్తామన్నారు. అంతేకాకుండా బ్రిడ్జి వద్ద శాశ్వత పరిష్కారానికి సెంట్రల్ లైటింగ్ తో హైమాస్ లైట్లు కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని, ఏ వార్డుల్లో కూడా ఏ సమస్య ఉన్నా కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి లేదా ప్రత్యక్షంగా తనను కలవాలని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ,సమస్య ఎంత కఠినంగా ఉన్న పరిష్కారం చేస్తామని సెక్రెటరీ నాగరాజు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed