- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
దిశ, మిర్యాలగూడ: గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని తక్కెళ్ళపహాడ్ గ్రామంలో స్పెషల్ డెవెలప్ మెంట్ ఫండ్ ద్వారా రూ. 20 లక్షలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంటు ద్వారా రూ. 15 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, సర్పంచ్ చౌగాని బిక్షమ్ గౌడ్, ఎం.పీ.టీ.సీ పాశం హైమవతి నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ ఎల్లమ్మ, మాజీ ఎం.పీ.టీ.సీ లు భుక్య సైదా నాయక్, పానుగోతు ఈశ్వర్ నాయక్, కారింగుల శేఖర్, జానపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.