బీజేపీ మతోన్మాద విధానాలపై సీపీఎం పోరాటం

by Disha Web Desk 11 |
బీజేపీ మతోన్మాద విధానాలపై సీపీఎం పోరాటం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద విధానాలను ఎదిరించి పోరాడేందుకు సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని సీపీఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. భువనగిరి పార్లమెంట్ సీపీఎం‌ పార్టీ అభ్యర్థి ఎండీ జహాంగీర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో రాఘవులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి మాట్లాడారు. బీజేపీ 17 స్థానాలు గెలవాలని ఉవ్విళ్లూరుతుందని, దాని ఆశలను భంగం చేస్తామని, తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కువగా ఉన్నాయని,

బీజేపీ విధానాలను ఎండగట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీని నిలువరించేలా కాంగ్రెస్ ,బీఆర్ఎస్ పార్టీలు సైతం పోరాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అవకాశం లేకుండా చేయాలన్నారు. మూడోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగమే మారుస్తారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, గతంలో ఉన్న ప్రభుత్వం మీద నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిన తర్వాత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను, కార్మికుల సమస్యలను చర్చించి ఒక అభిప్రాయాలకు వచ్చే పరిష్కారం చేయడం లేదన్నారు.

పైగా సిపిఎం పార్టీ అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లి అవినీతి జరుగుతుందని మాట్లాడడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరిపెల్లి సీతారాములు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, చుక్క రాములు, పి జ్యోతి, జాన్ వెస్లీ, పాలుడుగు భాస్కర్, డీజే నర్సింగ్ రావు, మల్లు లక్ష్మి పోతినేని సుదర్శన్, ఎండి అబ్బాస్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed