ఓటమి భయంతోనే పాలమూరులో కాంగ్రెస్ నీచ రాజకీయాలు : డీకే అరుణ

by Disha Web Desk 23 |
ఓటమి భయంతోనే పాలమూరులో కాంగ్రెస్ నీచ రాజకీయాలు : డీకే అరుణ
X

దిశ,నర్వ: నారాయణపేట జిల్లా నర్వ మండలం లోని పాతర్చేడ్, నర్వ,పెద్దకడబూరు గ్రామాలలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మా కుటుంబం పై ఈ కల్వకుర్థోళ్ళు కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. ఆనాడు జైపాల్ రెడ్డి మొదలు పెట్టుకొని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వరకు నన్ను నా కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఆరోజు జైపాల్ రెడ్డి నాకు టికెట్ రాకుండా చేసారని మంది పడ్డారు. ఆ కోపంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్న అలంపూర్, గద్వాలను మహబూబ్ నగర్ లోంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో కలిపారని గుర్తు చేశారు. ఒక ఆడపిల్లను అయినా ఉమ్మడి జిల్లా మొత్తం పని చేశాను ఉమ్మడి జిల్లా మంత్రి గా 14 నియోజకవర్గాలలో డీకే అరుణమ్మ పనిచేసింది ప్రజల కోసం, ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్ట్ ల కోసం పోరాటం చేసింది డీకే అరుణ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర అరుణమ్మ అని అన్నారు.

అరుణమ్మను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి వెనకనుంచి వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు పనిగట్టుకొని నాపై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా అవమానపరిచేలా పోస్టులు పెట్టిస్తూ, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక నా మీద ఏడుస్తున్నారు మక్తల్ లో అరుణమ్మ ఏం చేసిందో ఎమ్మెల్యే శ్రీహరికి తెలియదా అని అన్నారు. గెలిచినా ఓడినా ఇక్కడే ప్రజల మధ్యలోనే ఉంటా, ఇప్పుడున్న నాయకులు ఆరోజు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు కానీ నేను గెలిచినా, ఓడినా మీతోనే ఉన్నా, మీ వెంటే ఉంటాను ఎందుకంటే ఇది నా ప్రాంతం అన్న మమకారం నాకు ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులలో ఎవ్వరు గెలిచిన తర్వాత జిల్లా వైపు కూడా చూడలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి,కోలార్ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణమ్మ నర్వ మండలం మరియు మక్తల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు వావిల నరేందర్, జగనాదం, వెంకటేశ్వరరావు,ఎం ఆర్ పీ ఎస్ నాయకుడు గుడిసె వెంకటయ్య, లలిత వెంకట్ రెడ్డి, వావిల రవి, అజిత్ సింహ రెడ్డి, యువకులు కుర్మన్న,శ్రీనివాస్, శ్రీకాంత్, శివకృష్ణ వివిధ గ్రామాల నాయకులు యువకులు మహిళలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed