ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు సంచలన నిర్ణయం..కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-17 13:40:03.0  )
ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు సంచలన నిర్ణయం..కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్:టీడీపీ ప్రతి ఏటా మే 27,28, 29 తేదీల్లో ‘మహానాడు’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల హడావిడి ఉండటంతో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మే 28వ తేదీ కలిసివచ్చేలా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. పార్టీ కార్యకర్తల పసుపు పండగగా మహానాడును జరుపుకుంటారు. ఈ సారి ఇది వాయిదా పడింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. పార్టీ నేతలంతా ఆ పనుల్లో ఉంటారు కాబట్టి మహానాడు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. చంద్రబాబు పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ 2025లోనే మహానాడును నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

Read More..

వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్లా.. అజ్ఞాతం ప్రచారంపై స్పందించిన పిన్నెల్లి

Advertisement

Next Story