- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ చెప్పిన ఆ స్పెషల్ పర్సన్‌పై శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఈ ఏడాదే పెళ్లి అంటూ షాకిచ్చిందిగా!
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్ని హిట్ చిత్రాలు చేసి స్టార్ హీరోగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాహుబలి మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా వరుస చిత్రాలు చేస్తూ బిజీ బిజీ లైఫ్‌ను గడుపుతున్నాడు. ఆయన నటించిన కల్కి తొందరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది. ఇక డార్లింగ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 44 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోలేదు.
బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ నిత్యం పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. అయినప్పటికీ అలాంటి వాటిని అసలు ప్రభాస్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందడుగు వేస్తుంటాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తన లైఫ్‌లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతుదంటూ ప్రకటించి బిగ్ షాకిచ్చాడు. దీంతో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఆమె గురించే చెప్తూ ఆ పోస్ట్ పెట్టాడని అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తన కొడుకు లైఫ్‌లోకి వచ్చే ఆ స్పెషల్ ఎవరో క్లారిటీ ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామలాదేవి తన మాటలతో అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘‘ ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ దేవుడి దయవల్ల మీరంతా త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇదంతా పైన ఉన్న కృష్ణం రాజు గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. దీంతో యాంకర్ ఆ అమ్మాయి ఎవరని అడగ్గా.. అది చెప్పను కానీ శుభవార్త వినడానికి రెడీగా ఉండండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్యామలాదేవి కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు గుడ్ న్యూస్ సూపర్ అని అంటున్నారు. మరికొందరు మాత్రం కాబోయే వదిన ఫొటో నెట్టింట పెట్టాలని కామెంట్లు పెడుతున్నారు. అసలు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడో లేదో? కానీ స్పెషల్ పర్సన్ రాబోతున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూల్గా లేదు.