సైకిల్ ఉంటే చాలు.. వాషింగ్ మెషిన్ అవసరమే లేదంట!

by Ramesh N |   ( Updated:2024-05-03 12:03:56.0  )
సైకిల్ ఉంటే చాలు.. వాషింగ్ మెషిన్ అవసరమే లేదంట!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొందరు విచిత్ర పనులు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు చాలా బట్టలు ఉతకాలంటే చేతులతో ఉతికేవారు. కానీ ప్రస్తుతం వాషింగ్ మెషిన్ సాయంతో ఈ పని చాలా సులభం అయ్యింది. మరోవైపు కొత్తగా వచ్చే వాషింగ్ మిషన్లలో బట్టలు ఉతకడమే కాకుండా బట్టలు ఆరబెట్టడం కూడా అదే చేస్తుంది. అయితే వాషింగ్ మెషిన్‌ లేకుండా సులభంగా బట్టలు ఉతకొచ్చని ఓ మహిళ విచిత్ర ఐడియాతో రీల్ చేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఓ మహిళ ఓ టబ్బులో బట్టలు నానబెట్టి.. దానిపై సైకిల్‌‌ను పడకోబెట్టింది. టబ్బులోకి సైకిల్ పెడల్ వచ్చే విధంగా సైకిల్‌ను పడుకోబెట్టి.. పెడల్‌ను తిప్పుతుంది. దీంతో టబ్బులో ఉన్న బట్టలు వాషింగ్ మెషిన్‌లో తిరిగే మాదిరిగా రోల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో.. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘మా అమ్మ వాషింగ్ మెషిన్ కొందామని ఎప్పటినుండో అడుగుతుంది. మా ఇంట్లో కూడా సైకిల్ ఉంది.. వెంటనే మా అమ్మకి ఈ గుడ్ న్యూస్ చెప్పాలి’ అని నెటిజన్ కామెంట్ చేశారు. వాషింగ్ మెషిన్ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది.. ఇలా సైకిల్ వాడితే కరెంట్ బిల్లు ఆదా చేయడంతో పాటు శరీరానికి వ్యాయామం కూడా అవుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed