జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు..ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం నాశనమే:పవన్ కళ్యాణ్

by Jakkula Mamatha |   ( Updated:2024-05-02 14:55:19.0  )
జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు..ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం నాశనమే:పవన్ కళ్యాణ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు కూటమి పార్టీలు ఇటు అధికార పార్టీల నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యర్థులపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెందుర్తిలో సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలని పెందుర్తి సభలో పవన్ కళ్యాణ్ అన్నారు. శక్తియుక్తులు, ప్రతిభాపాటవాలు ఉన్న 23 మంది లక్షల యువతకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ ఛిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. గంజాయిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారన్నారు. మేం అధికారంలోకి వచ్చాక యువతలో ఉన్న నైపుణ్యాలను బట్టి శిక్షణ ఇస్తాం అన్నారు. యువత ఉద్యోగాల కోసం వలసలు వెళ్లాల్సిన అవసరం లేదు అన్నారు. వారికి ఉపాధి కల్పిస్తాం అని పవన్ స్పష్టం చేశారు.

Read More..

అసలు ఏం చేశారు.. ఎందుకు సిద్ధం: సీఎం జగన్‌పై పవన్ ఫైర్

Advertisement

Next Story