- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్లుగా కలగానే..సొంత పోలీస్ స్టేషన్ భవనాలు ఇంకెప్పుడో?
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్‌లో గతంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు కలగానే మిగిలిపోయాయి. కొత్తగా ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా తాత్కాలిక భవనాలలోనే ఈ పోలీస్ స్టేషన్లు తమ విధులు నిర్వహిస్తున్నాయి. 2016 సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆ జిల్లాలలో కొన్ని మండలాలను సైతం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పాటు చేసి, అందులో నూతంగా రెండు మోటకొండూరు, అడ్డగూడురు మండలాలుగా విభజించింది. విభజించిన నాటి నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్లను తాత్కాలిక భవనాలలోనే ఏర్పాటు చేశారు. అడ్డగూడురులో వెటర్నరీ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ భవనాన్ని ఏర్పాటు చేయగా, మోటకొండూరు మండల కేంద్రంలో ఒక నివాస గృహాంలో ఏర్పాటు చేశారు.
నిధులు మంజూరైనా..
ఈ పోలీస్ స్టేషన్లకు నూతన భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన కూడా అనువైన స్థలం దొరకకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఇప్పటికి ఆరున్నర సంవత్సరాలు గడిచిన తరువాత కూడా నూతన పోలీస్ స్టేషన్ భవనం నిర్మించకపోవడం వలన సిబ్బంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలు ఇరుకుగా మారడంతో పాటు, పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వాహనాల పార్కింగ్, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు వాహనాలకు పార్కింగ్ లాంటి పలు సమస్యలు ఎదుర్కుంటున్నారు.
త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి : రాజేష్ చంద్ర, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్
యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలో మోటకొండూరు, అడ్డగూడురు పోలీస్ స్టేషన్లకు నూతన భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. వీటికి సంబంధించి స్థల సేకరణ పనులను కూడ వేగవంతం చేశాం. కొన్ని స్థలాలను పరిశీలించాం. త్వరలోనే వీటికి సంబంధించిన పనులన్నింటిని పూర్తి చేసి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తాం.