- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన..
దిశ, కోదాడ టౌన్: జేఈఈ మెయిన్స్‌లో రేస్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారని వాగ్దేవి విద్య సంస్థల చైర్‌పర్సన్ బాణాల వసంత వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రేస్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలకు చెందిన కే మహాలక్ష్మి 1180 ర్యాంకు, సాయి దీపిక 1914, సురేష్ రెడ్డి 3289, రామ్ చరణ్ 3466, మహర్షి 3635, సానియా 4624, ర్యాంకులను సాధించినట్లు ఆమె తెలిపారు.
వీరితోపాటు మరో 20 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆమె తెలిపారు. పేద విద్యార్థులకు ఈ కళాశాలలో కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించే విధంగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారావు, డిన్ రామకృష్ణ, త్రివేణి కళాశాల ప్రిన్సిపాల్ సిరికొండ శ్రీనివాస్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ మధు, అధ్యాపకులు విజయ్ కుమార్, నరసింహారెడ్డి, ఎంజీ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.