- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ డిప్యూటేషన్ పై లోకాయుక్తలో ఫిర్యాదు..
దిశ, చింతపల్లి : చింతపల్లి మండలం ప్రాథమికోన్నత పాఠశాల నెల్వలపల్లి గ్రామం నుండి జరిగిన టీచర్ అక్రమ డిప్యూటేషన్ సర్దుబాటుపై తెలంగాణ లోకాయుక్త లో ఫిర్యాదు చేసినట్టుగా బుధవారం ఒక ప్రకటనలో గ్రామస్తులు తెలిపారు. ఎటువంటి ఉత్తర్వులు లేకుండా టీచర్ను పోలేపల్లి రామ్ నగర్ పాఠశాలకు ఎలా పంపుతారని పలుమార్లు అధికార్లను అడిగినా స్పందన లేదని, మండల స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికార్లు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
జిల్లా విద్యా శాఖాధికారి పై, అక్రమ డిప్యూటేషన్ సర్దుబాటు పై వెళ్లిన టీచర్ పై, ఉత్తర్వులు లేకుండా టీచర్ను జాయిన్ చేసుకున్న పోలేపల్లీ రామ్ నగర్ పాఠశాల హెడ్మాస్టర్ పై ఫిర్యాదు చేసినట్టుగా గ్రామస్తులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే అని చెప్పారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో గొడ్డటి మధు, పొలగోని వినోద్, గజ్జల వెంకట్ రెడ్డి, నల్లగాసు వెంకటయ్య, తుల్ల రామకృష్ణ, నక్క లక్ష్మయ్య, మాడేం శ్రీను ఉన్నారు.