సమగ్ర కుటుంబ సర్వేకై వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

by Aamani |
సమగ్ర కుటుంబ సర్వేకై  వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలి : కలెక్టర్  రాహుల్ రాజ్
X

దిశ,టేక్మాల్: సమగ్ర కుటుంబ సర్వే కై వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ‌ కోరారు.బుధవారం టేక్మాల్ మండలంలోని కోరంపల్లి గ్రామంలో ప్రారంభమైన సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మొదలగు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సర్వే ద్వారా సేకరించిన వివరాలు గోప్యంగా వుంటాయని, ఎవరికీ సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని,అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు. తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఈ సమాచారం వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో టేక్మాల్ తహసీల్దార్ తులసి రామ్, మండల అభివృద్ధి అధికారి విటల్, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed