- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మత్తు పదార్థాలు ఉంటే జాగిలాలకు చిక్కినట్టే
దిశ,టేకులపల్లి : మత్తు పదార్థాలను కనిపెట్టేందుకు జాగిలాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ ను కనిపెట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలతో టేకులపల్లి మండలంలోని పాత గంజాయి నేరస్తుల ఇళ్లల్లో, నిర్మాణుష్య ప్రదేశాలలో టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పోగుల సురేష్, జాగిలం హ్యాండ్లర్ వెంకటేష్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అనంతరం సీఐ మాట్లాడుతూ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా నిషేధిత గంజాయిని రవాణా చేసే వ్యక్తులను పట్టుకోవడానికి వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు పోలీస్ జాగిలాల సహాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. టేకులపల్లిలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. ఈ తనిఖీలలో టేకులపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.