- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Priyanka Gandhi: రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకే మోడీ ప్రయత్నం.. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగ విలువలైన సమానత్వం, న్యాయం, లౌకికవాదాన్ని ధ్వంసం చేసేందుకే బీజేపీ, ప్రధాని మోడీ (Pm modi) నిరంతరం ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) విమర్శించారు. గత దశాబ్ద కాలంగా దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలను అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చి అధికారాన్ని కాపాడుకోవడానికి మాత్రమే పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వయనాడ్ (wayanad) ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్లప్పురం (Malappuram) జిల్లాలో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించడం లేదని తెలిపారు. తనను ఎన్నుకున్న ప్రజలను విస్మరించి అధికారంలో ఉండేందుకు వారిని ఉపయోగించుకునే నాయకుడు మోడీ అని ఆరోపించారు. సుగంధ ద్రవ్యాలు వంటి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన వయనాడ్‌లోని రైతులు వ్యవసాయంలో భవిష్యత్తును చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.